నందమూరి అభిమానులకు మెచ్చే స్టోరీలో తారక్!
- May 25, 2017 / 12:18 PM ISTByFilmy Focus
మహా నటుడు నందమూరి తారకరామారావు ఆశీసులతో ఆయన మనవుడు ఎన్టీఆర్ సినీ రంగంలో దూసుకుపోతున్నారు. నటనలో తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నారు. అలాగే రాజకీయంలో ఎంట్రీ ఇచ్చి నేతగా అవ్వాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు ఇంకా సమయం ఉండడంతో కనీసం తెరపైన అయినా లీడర్ గా కనిపిస్తే చూడాలని ఆశపడుతున్నారు. ఆ ఆశ త్వరలో నెరవేరనుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రల్లో నటవిశ్వరూపం ప్రదర్శించనున్నారు.
భారీ అంచనాలున్న సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. దీని తర్వాత తన 28 వ సినిమాని కొరటాల శివ తో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ మూవీ గురించి తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే .. ఇందులో ఎన్టీఆర్ రాజకీయనాయకుడిగా నటించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక సందేశాన్ని ఇవ్వనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషనలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మళ్లీ ఈ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















