సినిమా స్టార్స్ ఇప్పుడు ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనాలోచితంగా, ఆవేశపూరితంగా చిన్న మాట చెప్పినా.. సోషల్ మీడియా పుణ్యమా అది పెద్దది అయి పోతోంది. ఆ విషయం గురించి తెలిసి స్టార్ హీరోస్ అలోచించి మాట్లాడుతున్నారు. మీడియా వారు ఎటువంటి క్లిష్ట ప్రశ్నలు వేసినప్పటికీ.. తెలివిగా సమాధానం చెబుతున్నారు. ఈరోజు ఎన్టీఆర్ అలాగే తనకెదురైనా ప్రశ్నకు వివాదరహితంగా సమాధానం చెప్పి శెభాష్ అనిపించుకున్నారు. తారక్ నటించిన జై లవకుశ సినిమా రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు.
ఈ విధంగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూ లో యాంకర్ “2019 ఎనికల్లో ప్రజలముందుకు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రాబోతోంది కదా మరి ఈ పార్టీ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనే ప్రశ్న” వేశారు. ఇందుకు ఎన్టీఆర్ “నాకు బేసిగ్గా ఏ పొలిటికల్ పార్టీ మీదా ప్రత్యేకమైన ఎక్స్ పెక్టేషన్స్ లాంటివేమీ లేవు. ఒక భారతదేశ పౌరుడిగా ఏ పార్టీ అయినా సరే ప్రజలకి మంచి జరిగితే చాలు అనుకుంటాను”అని సమాధానం ఇచ్చారు. జనసేన పార్టీని విమర్శించి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురికాకుండా, ప్రశంసించి నందమూరి అభిమానులకు దూరంకాకుండా చక్కగా సమాధానం ఇచ్చారని సినీ విశ్లేషకులు ఎన్టీఆర్ ని అభినందిస్తున్నారు.