Jr NTR: తాతపై ప్రేమను చాటుకున్న తారక్.. పోస్ట్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో తాతపై తనకు ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటారనే సంగతి తెలిసిందే. ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిమ్మకూరులో ఘనంగా జరుగుతున్నాయి. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కళ్యాణ్, రామ్, లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ” మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.

మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా” అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా సీనియర్ ఎన్టీఆర్ గురించి పోస్ట్ లు పెడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య తర్వాత సినిమా నుంచి పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో బాలయ్య కత్తి పట్టుకుని కొత్తగా కనిపించారు.

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ కొరటాల శివ స్క్రిప్ట్ పనులలో ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్ది కొరటాల శివ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus