Jr NTR: ఫ్యాన్స్ ఆకాంక్షను తారక్ పట్టించుకుంటారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో విదేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులలో ఎక్కువమంది తారక్ రాజకీయాలలో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు. నిన్న చెన్నైలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు వేల సంఖ్యలో చరణ్ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు సైతం హాజరై సందడి చేశారు. అయితే నిన్న జరిగిన ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ జెండాలతో కనిపించారు.

ఎన్టీఆర్ సినిమా ఈవెంట్లలో టీడీపీ జెండాల ద్వారా తారక్ రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఈవెంట్లలో ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ తారక్ రాజకీయాల్లోకి రావాలని నినాదాలు కూడా చేస్తున్నారు. అభిమానులు చేస్తున్న నినాదాలను తారక్ పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే సీఎం అవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏపీలో ప్రసుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 2024 సంవత్సరం నాటికి ఈ పార్టీ పుంజుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

2019 సంవత్సరంలో టీడీపీ ఏపీలో కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. మరోవైపు రాజకీయాల విషయంలో ఎన్టీఆర్ మనస్సులో ఏముందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఎన్టీఆర్ కు అప్పగిస్తే పార్టీకి మేలు జరుగుతుందని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఆహ్వానిస్తే ఎన్టీఆర్ సైతం రాజకీయాలపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ తర్వాత సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. ఎన్టీఅర్ కొరటాల శివ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ 2022 సంవత్సరం మార్చి నెల నుంచి మొదలుకానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాకు కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus