ఎన్టీఆర్ నో చెప్పిన కథలో నితిన్!

దిల్ రాజు టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం శతమానం భవతి సినిమాతో ఆర్ధిక విజయంతో పాటు.. జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. తర్వాత నేను లోకల్, ఫిదా, రాజా ది గ్రేట్ వంటి హిట్స్ సొంతం చేసుకున్నారు. ఇలా ప్రతి సీజన్ లో ఓ విజయాన్ని అందుకుంటున్నారు. ఇప్పుడు నాని తో ఎంసీఏ నిర్మిస్తున్నారు. మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ ని లైన్లో పెట్టారు. దాని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ప్లాన్ చేశారు. అందుకే శతమానం భవతి డైరెక్టర్ సతీష్‌ వేగేశ్నతో కథ సిద్ధం చేయించారు. ఎన్టీఆర్ కి వినిపించారు. దీనికి శ్రీనివాస కళ్యాణం పేరుని కూడా రిజిస్టర్ చేయించారు.

బృందావనం వంటి మంచి ఫ్యామిలీ చిత్రం రాబోతోందని అందరూ అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఈ కథ ఎన్టీఆర్ చేయడం లేదంట. ఈ కథలో నితిన్‌ హీరోగా నటించనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ వద్దనడానికి కారణాలు బయటికి రావడం లేదు గానీ.. తనకి దిల్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్లో మళ్లీ నటించడానికి నితిన్ ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.  ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus