ఎన్నో వాయిదాల తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లింది. అయితే, ఫస్ట్ షెడ్యూల్ తర్వాత షూట్ చేసిన కొన్ని భాగాలను పక్కన పెట్టేశారని, నవంబర్ నుంచి కొత్త మార్పులతో రీస్టార్ట్ చేయనున్నారని టాక్ వచ్చింది. ఇప్పుడు, ఈ ప్రాజెక్ట్ గురించి మరో సంచలన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
Dragon
కథ చాలా భారీగా ఉండటంతో, ‘డ్రాగన్’ను ఒకే సినిమాలో కుదించడం కష్టమని, అందుకే దీన్ని రెండు భాగాలుగా తీయాలని నీల్ భావిస్తున్నారట. ఇది ప్రశాంత్ నీల్‌కు కొత్తేమీ కాదు. ‘KGF’, ‘సలార్’ రెండూ మొదట సింగిల్ ఫిల్మ్స్‌గా మొదలై, ఆ తర్వాత రెండు భాగాలుగా విస్తరించాయి.
అయితే, ఈసారి నీల్ తన పాత స్ట్రాటజీని రిపీట్ చేయడం లేదని సమాచారం. ‘KGF’, ‘సలార్’ సినిమాలకు పార్ట్ 1కి, పార్ట్ 2కి మధ్య ఏళ్ల తరబడి గ్యాప్ వచ్చింది. కానీ ‘డ్రాగన్’ విషయంలో అలా కాకుండా, రెండు భాగాలను ఒకే స్ట్రెచ్‌లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
అంతేకాదు, రెండు పార్టులను కేవలం కొన్ని నెలల స్వల్ప గ్యాప్‌లోనే విడుదల చేయాలనేది నీల్ ఆలోచన. ఇండియన్ సినిమాలో ఈ “షార్ట్ గ్యాప్” రిలీజ్ ట్రెండ్ చాలా అరుదు, ఇది పెద్ద రిస్క్. మొదటి భాగం ప్రేక్షకులకు కనెక్ట్ అయి, రెండో భాగం కోసం హైప్ పెరగడానికి కొంత సమయం పడుతుంది.
ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది, మేకర్స్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఒకేసారి రెండు భాగాలు షూట్ చేసి, వెంటవెంటనే రిలీజ్ చేయాలని నీల్ ప్లాన్ చేస్తుంటే, అది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మరో కొత్త ప్రయోగమే అవుతుంది. ఈ ‘టూ పార్ట్’ ప్లాన్‌పై అధికారిక ప్రకటన వస్తే తప్ప, ఈ వార్తలో నిజమెంతో తెలియదు.