Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

సినిమా – వారసత్వం.. ఈ టాపిక్స్‌ గురించి టాలీవుడ్‌లో ఎంత మాట్లాడినా కథ ముందుకు నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వారసులు చాలామంది ఉన్నారు. వస్తున్నారు, వస్తారు కూడా. హీరో కొడుకు హీరోనే అన్నట్లుగా సినిమాలు చేస్తుండగా, నిర్మాతలు.. దర్శకుల తనయులూ ఇటువైపు వస్తున్నారు. ఇప్పుడు స్టార్‌ హీరోలుగా వెలుగొందుతున్నవారు కూడా రేపొద్దున తన బిడ్డల్ని హీరోలుగా చేస్తాడు అని అనుకుంటున్న సమయంలో తారక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Jr Ntr

హృతిక్‌ రోషన్‌తో కలసి తారక్‌ నటించిన ‘వార్‌ 2’ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ తాజా ఎడిషన్‌ కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫొటో ముద్రించారు. దాంతోపాటు ఆ మ్యాగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ ఫొటో, ఈ వ్యాఖ్యలు మొత్తంగా వైరల్‌గా మారాయి.

నా జీవితంలో ఏది, ఎలా జరగాలో నేనెప్పుడూ ప్లాన్‌ చేసుకోలేదు అని తారక్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘కుంగ్‌ ఫు పాండా’లో ఒక కొటేషన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ‘నిన్నటి రోజు చరిత్ర.. రేపటి రోజు తెలియని మర్మం.. ఈ రోజు మన చేతిలో ఉన్న గొప్ప బహుమతి’ అనే కోట్‌ నాకు ఎప్పటికీ స్ఫూర్తి. అందుకే నా దృష్టి ఎప్పుడూ వర్తమానంపైనే పెడతాను. ఒక నటుడిగా నేను ఏం చేయడానికైనా సిద్ధం అని తారక్‌ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత సినిమాలు, వారసత్వం గురించి మాట్లాడాడు కుటుంబంలో సినీ వారసత్వం విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. దాని కోసం నేను ఏమీ ప్లాన్‌ కూడా చేయలేదు. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే గొప్ప కథలను చెప్పడం ద్వారా ప్రేక్షకులకు దగ్గర కావాలని అనుకున్నాను. అంతేకాదు భావోద్వేగాలు కలగలిసిన నిజాయతీపరుడిగా ప్రజలు నన్ను గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాను అని తారక్‌ చెప్పాడు. దీంతో వారసత్వం గురించి మాట్లాడాడు తారక్‌.. ఏమైంది అనే చర్చ మొదలైంది.

‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus