జై లవ కుశ చిత్రానికి డబ్బింగ్ ప్రారంభించిన ఎన్టీఆర్
- August 22, 2017 / 06:39 AM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా జై లవకుశ సినిమా రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది. ఇందులోని ఒక క్యారక్టర్ అయిన జై టీజర్ విడుదలై విశేషంగా ఆకట్టుకోగా, లవ కుమార్ కి సంబంధించిన టీజర్ వినాయకచవితికి రిలీజ్ కానుంది. మూడో క్యారక్టర్ కుశ టీజర్ కూడా ముస్తాబుతోంది. అయితే ఈ చిత్రానికి ఎడిటింగ్ దాదాపు పూర్తి అయిందని, ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం కూడా మొదలెట్టారని సమాచారం. ముందుగా జై పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిసింది.
నత్తితో మాట్లాడాల్సి ఉండడం వల్ల.. ఇదే కష్టమని భావించిన ఎన్టీఆర్ .. ఆ పాత్రకే డబ్బింగ్ మొదలెట్టినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్నఈ సినిమాలో తారక్ పక్కన ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















