ఎంతటి స్టార్ హీరో అయినా పొరుగు పరిశ్రమలకు చెందిన దర్శకులతో కమిటై దెబ్బై పోయారు.పక్క పరిశ్రమల సంగీత దర్శకులు, దర్శకులతో చేసిన సినిమాలు మన దగ్గర అంతగా విజయం సాధించలేదు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ప్రతి డైరెక్ట్ తెలుగు మూవీ పరాజయం పొందాయి. ఇక తమిళంలో టాప్ డైరెక్టర్ గా ఉన్న మురుగదాస్ చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ చిత్రాలు తీశాడు.
స్టాలిన్ యావరేజ్ మూవీగా నిలువగా స్పైడర్ డిజాస్టర్ అయ్యింది. పొరుగు పరిశ్రమల దర్శకులను మన స్టార్ హీరోలు ట్రై చేసింది చాలా తక్కువ అయినప్పటికీ ఫలితం నెగెటివ్ గానే వచ్చింది. కాగా ఎన్టీఆర్ తన 31వ చిత్రం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కెజిఎఫ్ మూవీతో ఒక్కసారి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ అధ్బుతంగా తెరకెక్కిస్తాడని ఫ్యాన్స్ గట్టినమ్మకంతో ఉన్నారు.
ఐతే గత సెంటిమెంట్ మాత్రం భయపెడుతుంది. సెంటిమెంట్ సంగతి అటుంచితే వాస్తవంలో నేటివిటీ ప్రాబ్లెమ్ అనేది ఒకటి ఉంది. తమిళ, కన్నడ దర్శకులు తెరకెక్కించే చిత్రాలలో ఆ వాసనలు ఉంటాయి. దీనితో అంతా బాగున్నా ఎక్కడో లోటు అన్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది. అలా ఆశించిన విజయం దక్కడం లేదు. మరి ప్రశాంత్ పాన్ ఇండియా మూవీగా, యూనివర్సల్ కాన్సెప్ట్ తో రానున్నాడని తెలుస్తుండగా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయవచ్చు.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్