పవన్ కళ్యాణ్ పై ఆధారపడిన ఎన్టీఆర్ మూవీ
- May 10, 2017 / 12:03 PM ISTByFilmy Focus
ఎన్టీఆర్ సినిమా పవన్ కళ్యాణ్ చేతిలో ఉండడం ఏమిటి?, వారిద్దరికి అసలు సంబంధం ఏమిటి?.. టైటిల్ చూడగానే ప్రతి ఒక్కరి మెదిలే ప్రశ్నలు ఇవి. నిజమే పవర్ స్టార్ కి యంగ్ టైగర్ కి ఎటువంటి సంబంధం లేదు. అయితే వీరిద్దరితో సినిమా తీయనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సంబంధం ఉంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ తో మూడో మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ కూడా బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1 న రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి ప్రాజెక్ట్ మొదలెట్టనున్నారు. అయితే అప్పటిలోపున త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మూవీని కంప్లీట్ చేస్తాడా? లేదా? అనేదే ఇప్పుడు అందరి డౌట్.
అనుకున్నదానికంటే పవన్ 25 మూవీ ఆలస్యంగా మొదలయింది. జనసేన పార్టీ వ్యవహారాల కోసం కొన్ని రోజులు పవన్ కేటాయిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అలా అనుకోకుండా షూటింగ్ వాయిదా పడే ఆస్కారం ఉంది. షూటింగ్ వాయిదా పడకుండా ఉంటే అక్టోబర్ లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కే ఆస్కారం ఉంది. లేకుంటే ఎన్టీఆర్ వేరే దర్శకునికి తన డేట్స్ కేటాయిస్తారు. కాబట్టి ఎన్టీఆర్ సినిమా పవన్ చేతిలోనే ఉంది. ఆయన తొందరగా షూటింగ్ కంప్లీట్ చేస్తే.. ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజక్ట్ కార్యరూపం దాల్చుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















