NTR30: ఎన్టీఆర్30 పూజా కార్యక్రమాలకు సంబంధించిన డేట్ ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఎన్టీఆర్30 షూటింగ్ కు, పూజా కార్యక్రమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చేశాయి. మార్చి 18వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనుండగా మార్చి 29వ తేదీ నుంచి ఈ సినిమా షూట్ మొదలుకానుంది. ఈ డేట్లలో దాదాపుగా ఎలాంటి మార్పు ఉండదని సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ కూడా పూజా కార్యక్రమాలకు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఈ కాంబినేషన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రానున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లలో బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోనున్నారని బోగట్టా. ఎన్టీఆర్30 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని మాస్ ప్రేక్షకులను, యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం నిరాశ పరిచే అవకాశం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్30 పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా జాన్వీని ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా చూపించనున్నారు. ఎన్టీఆర్30 సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో తారక్ బాక్సాసీస్ వద్ద సందడి చేయనున్నారు. తారక్ ఈ సినిమాతో సోలో హీరోగా తన మార్కెట్ రేంజ్ ను ప్రూవ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. తారక్ ఇతర హీరోలతో మల్టీస్టారర్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.

తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా మరిన్ని విజయాలను సొంతం చేసుకొని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో పౌరాణిక పాత్రల్లో తెరకెక్కనున్న సినిమాలలో కూడా నటించనున్నారని తెలుస్తోంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus