రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమా తెరకెక్కుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ చిత్రానికి దర్శకుడు. ‘టి.సిరీస్’ వారితో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ మధ్యనే ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఫస్ట్ సింగిల్ కూడా వదిలారు. రామ్ ఈ చిత్రంతో లిరిసిస్ట్ అవతారం ఎత్తాడు. మరి అతని పెన్ నుండి పుట్టిన పాట ఎలా ఉందో తెలుసుకుందాం రండి. ‘నువ్వుంటే చాలే’ లిరికల్ సాంగ్ 4 నిమిషాల నిడివి కలిగి ఉంది.
‘ఒక చూపుతో నాలోనే పుట్టిందే.. ఏదో వింతగా గుండెలో చేరిందే.. నువ్వు ఎవ్వరో నాలోనే అడిగానే’ అనే లిరిక్స్ తో పాట మొదలైంది. ‘నువ్వుంటే చాలే’ అనే లిరిక్స్ వచ్చినప్పుడు మంచి హై వచ్చింది. ఆ తర్వాత సాంగ్ ఫ్లో ఎక్కడా డౌన్ అవ్వలేదు. సంగీత దర్శకులు వివేక్ మెర్విన్ అందించిన ట్యూన్ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. హీరో రామ్ పోతినేని అందించిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాడిన విధానం కూడా మెప్పిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫస్ట్ సింగిల్స్ ఏవీ కూడా వినగానే ఎక్కేసేలా ఉండటం లేదు. కానీ ‘నువ్వుంటే చాలు’ సాంగ్ కచ్చితంగా వినగానే ఎక్కేసేలా ఉంది. అలాగే వెంటనే మరోసారి వినేలా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఒకసారి మీరు కూడా చూస్తూ వినండి :