అక్టోబర్ నెలలో రెండు సినిమాలు మాత్రమే హిట్టయ్యాయా?

ప్రతి నెలా పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉంటాయి. అక్టోబర్ నెలలో కూడా దాదాపుగా 30 సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలలో హిట్టైన సినిమాలు 2 మాత్రమే కాగా ఈ రెండు సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలే కావడం గమనార్హం. కాంతార, సర్దార్ మినహా అక్టోబర్ నెలలో విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. స్ట్రెయిట్ సినిమాలలో ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, ఓరి దేవుడా, జిన్నా సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.

గాడ్ ఫాదర్ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చినా ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. లూసిఫర్ సినిమాకు గాడ్ ఫాదర్ రీమేక్ కావడంతో అప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులు గాడ్ ఫాదర్ మూవీని థియేటర్లలో చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదనే సంగతి తెలిసిందే. జిన్నా సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఆ సినిమా కలెక్షన్లకు పొంతన లేదు. జిన్నా మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉండటం గమనార్హం.

స్వాతిముత్యం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా దసరా కానుకగా రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. కొన్ని సినిమాలు రీరిలీజ్ అయినా ఆ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అక్టోబర్ నెలలో రిలీజైన సినిమాలలో మెజారిటీ సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. నవంబర్ నెలలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు.

ఈ నెల కూడా బాక్సాఫీస్ వద్ద ఆశాజనకంగా ఫలితాలు ఉండే ఛాన్స్ అయితే లేదని చెప్పవచ్చు. డిసెంబర్ నెలలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న సినిమాలు రిలీజ్ అవుతుండటం గమనార్హం. 2022 సంవత్సరం టాలీవుడ్ నిర్మాతలలో మెజారిటీ నిర్మాతలకు కలిసి రావడం లేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus