Odela 3: ‘ఓదెల 2’ డిజాస్టర్ ఎఫెక్ట్.. కానీ అలా వర్కౌట్ అవుతుందట..!

కోవిడ్ టైంలో ‘మా ఊరి పొలిమేర’ (Maa Oori Polimera) అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రిలీజ్ అయ్యింది. దానికి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ ను తీశారు. అదే ‘పొలిమేర 2’ (Maa Oori Polimera 2). దీనిని కూడా ఓటీటీ కోసమనే తీశారు. కానీ కోవిడ్ తర్వాత ఓటీటీ సంస్థలు నేరుగా సినిమా రైట్స్ ను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. ‘ఎందుకంటే బల్క్ లో ఓటీటీకి అమ్మేశాము కదా, అని భావించి మేకర్స్ ప్రమోషన్స్ చేయడం లేదు.

Odela 3

అందువల్ల ఓటీటీలో ఆ సినిమాలు ఉన్నట్టు జనాలకి తెలీడం లేదు అని ఓటీటీ సంస్థలు తెలుసుకున్నాయి. అందుకే కచ్చితంగా థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తామని చెప్పేస్తున్నాయి. అందుకే ‘పొలిమేర 2’ ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇక్కడ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అనుకున్నదాని కంటే 30 రెట్లు ఎక్కువగా వచ్చాయి. అందుకే ఈ సినిమా పార్ట్ 3 ని కూడా గ్రాండ్ గా తీయడానికి ప్లానింగ్స్ జరుగుతున్నాయి.

ఇంకా ‘పొలిమేర’ లానే ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. దీంతో ‘ఓదెల 2’ (Odela 2) ను గ్రాండ్ గా తీసి థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అలాగే తీశారు. గ్లింప్స్, ట్రైలర్ వర్కౌట్ అవ్వడంతో సినిమా రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ ను సొంతం చేసుకుంది. అయితే సినిమా మాత్రం ఆ స్థాయిలో లేదు. అందువల్ల బయ్యర్స్ కి నష్టాలు వచ్చాయి. అది పక్కన పెట్టేస్తే… ‘ఓదెల 3’ (Odela 3) కూడా ఉంటుందని క్లైమాక్స్ లో రివీల్ చేశారు.

దానికి ఎలా లీడ్ ఇస్తున్నది నిర్మాత సంపత్ నంది (Sampath Nandi) వివరించారు. అయితే ‘ఓదెల 2’ రిజల్ట్ తో ‘ఓదెల 3’ (Odela 3) ని థియేటర్ సినిమాగా చేయడం కష్టం. ఇది సంపత్ నంది ముందే గ్రహించారు. అయితే ఓటీటీకి కచ్చితంగా మంచి ఆఫర్స్ వస్తాయి. అందుకే పార్ట్ 3 ని ఓటీటీ కోసం చేయాలని సంపత్ నంది, దర్శకుడు అశోక్ తేజ(Ashok Teja)  డిసైడ్ అయినట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus