RRR Release Date : ‘ఆర్.ఆర్.ఆర్’ కొత్త రిలీజ్ డేట్స్.. ఈసారి పెద్దగా గ్యాప్ లేదు..!

గత మూడున్నరేళ్ళ నుండీ మనకు ఇది అలవాటైపోయింది. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ కొత్త రిలీజ్ డేట్ గురించి చెప్పుకోవడం లేదా ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యిందని చెప్పుకోవడం. ఈ ఏడాది ఆరంభంలో జనవరి 7న విడుదల కావాల్సిన ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్ట్ పోన్ అయ్యింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు కాబట్టి దీని గురించి చెప్పుకోబోతున్నాం.పాండమిక్ సిట్యుయేషన్ కాస్త బెటర్ గా ఉండి ఇండియా వైడ్ థియేటర్లు అన్నీ తెరుచుకుంటే మార్చి 18న… లేదంటే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ‘ఆర్.ఆర్.ఆర్’ ను విడుదల చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు మేకర్స్.

ఈ రెండు కూడా మంచి డేట్లే.. అయితే ఏప్రిల్ 28న కనుక ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అయితే మరింత బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాతి రోజు నుండీ వీకెండ్ హడావుడి మొదలవుతుంది. ఆదివారం సెలవు. సోమవారం నాడు రంజాన్ హాలిడే. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ ఉండనే ఉంది. ఇలాంటి విడుదల తేదీనే ‘ఆర్.ఆర్.ఆర్’ కు ముఖ్యం కాబట్టి.. ఆ డేట్ కు వస్తే చాల బెటర్. అప్పుడు ప్రమోషన్స్ కూడా ఉగాది రోజు నుండీ ప్రారంభించుకుంటే సరిపోతుంది.

ఫిబ్రవరి నెల చివరి నాటికి కరోనా కేసులు తగ్గుతాయనే టాక్ ఉంది. ఇక టికెట్ రేట్ల ఇష్యు కూడా మరో నెలలో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఈ మాత్రం సరిపోతుంది కదా..! చూద్దాం ఏది ఫైనల్ అవుతుందో..! అయితే గతంలో ‘ఆర్.ఆర్.ఆర్’ ను పోస్ట్ పోన్ చేసినప్పుడు …అప్పటికి అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కంటే కూడా 8 నెలలు చొప్పున పెంచుకుంటూ పోయింది ‘ఆర్.ఆర్.ఆర్’ యూనిట్.

కానీ ఈసారి మాత్రం డిలే లేకుండా త్వరగానే రిలీజ్ డేట్స్ ను క్లారిటీగా ప్రకటించేసారు. ఇప్పటికే విడుదలైన 45 సెకండ్ల గ్లిమ్ప్స్, పాటలు, ట్రైలర్ వంటివి యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. చరణ్, ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులకి ఈసారి మోక్షం దొరకడం ఖాయంగానే కనిపిస్తుంది. వాళ్ళకి మాత్రమే కాదు ‘ఆర్.ఆర్.ఆర్’ కనుక రిలీజ్ అయితే కరోనా వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమ పూర్తిగా కోలుకుంటుంది అని అంతా భావిస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus