‘ఆయన్ని ఇబ్బంది పెట్టకంది.. సమయం వచ్చనప్పుడు మేమే అప్‌డేట్ ఇస్తాం’ అని కొన్ని రోజుల క్రితం డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ఓ ట్వీట్ చేసింది. మీరూ చూసే ఉంటారు. దానికి కారణం కొంతమంది ఫ్యాన్స్ పవన్ కల్యాణ్‌ను అప్‌డేట్ కోసం వేధిస్తుండటమే. ‘ఓజీ ఓజీ ఏంటయ్యా.. ఇది ప్రభుత్వపరమైన కార్యక్రమం’ అని పవన్ ఆ రోజు కాస్త విసుక్కున్నారు. దీంతో ఫ్యాన్స్ అప్‌డేట్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి. అయితే వారి ఎదురుచూపులకు తెరపడిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
‘ఓజీ’ సినిమాకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాని ప్రకారం చూస్తే సినిమా టీమ్ ఓ టీజర్‌ను రెడీ చేసింది. అంతేకాదు ఆ టీజర్ సెన్సార్ కూడా పూర్తయింది. 1.39 నిమిషాల నిడివి ఉన్న టీజర్‌ను దాసరి వీర వెంకట దానయ్య సెన్సార్ చేయించినట్లు ఆ స్క్రీన్‌షాట్ బట్టి తెలుస్తోంది. ఇక సర్టిఫికెట్ నెంబరు, డేట్ లాంటి వివరాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ ఆ స్క్రీన్‌షాట్ నిజమైతే.. ‘జీసీ’లో ‘ఓజీ’ని చూడబోతున్నాం.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజి’. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. లేటు చేయడం బాగోదు అనేమో చిత్రబృందం సినిమా టీజర్‌ను రిలీజ్ చేసే ఆలోచనలోకి వచ్చింది. అయితే ఇది టీజరా? లేక గ్లింప్స్ లెక్కన తీసుకొస్తారా అనేది చూడాలి.
ఒకవేళ వీడియో రాక నిజమైతే.. ఇద్దరు ‘గేమ్ ఛేంజర్’లను ఒకే స్క్రీన్ మీద చూసే అవకాశం కలగబోతోంది. మరి సినిమా ముందు ఈ టీజర్ ప్లే చేస్తారా? లేక సినిమా ఇంటర్వెల్‌లో వేస్తారా అనేది చూడాలి. మొన్నీమధ్య రాజమండ్రి ఈవెంట్‌లో ఇద్దరినీ చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశమన్నమాట.