‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి 6 సినిమాలు ప్లాపులు అవ్వడంతో శర్వానంద్ రేసులో కాస్త వెనక్కి పడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో ‘ఒకే ఒక జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది అతనికి 30వ సినిమా కావడం విశేషం.! నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 9న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.కానీ మొదట ఈ సినిమా పై అంచనాలు లేకపోవడంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కానీ ఈవెనింగ్ షోల నుండి పర్వాలేదు అనిపించాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.38 cr
సీడెడ్
0.07 cr
ఉత్తరాంధ్ర
0.08 cr
ఈస్ట్
0.05 cr
వెస్ట్
0.04 cr
గుంటూరు
0.08 cr
కృష్ణా
0.06 cr
నెల్లూరు
0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.12 cr
ఓవర్సీస్
0.45 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.33 cr
‘ఒకే ఒక జీవితం’ చిత్రానికి రూ.13.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే చాలా చోట్ల నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకోవడం, అడ్వాన్స్ బేస్ ల మీద రిలీజ్ చేసుకున్నారట.దీంతో ‘ఒకే ఒక జీవితం’ థియేట్రికల్ బిజినెస్ కుదించినట్లు తెలుస్తుంది . ఆ రకంగా చూసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్ల షేర్ మార్క్ ని రాబట్టాల్సిందట.
మొదటి రోజు ఈ చిత్రం రూ.1.33 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.67 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ మూవీ పెద్దగా రాణించలేదు. రెండో రోజు నుండి పుంజుకుంటుందేమో చూడాలి.