6 ప్లాప్ ల తర్వాత శర్వానంద్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ సినిమా హిట్ టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్ట్ చేసింది. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి సినిమాలు ప్లాప్ కావడంతో.. శర్వానంద్ రేసులో వెనక్కి పడ్డాడు. చాలా రోజుల తర్వాత ‘ఒకే ఒక జీవితం’ అంటూ తన జోనర్లో మూవీ చేశాడు.
టైం ట్రావెలింగ్ కథాంశంతో సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందిన ‘ఒకే ఒక జీవితం’ లో శర్వానంద్ తో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రలు పోషించారు. వీరి పాత్రలు కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి. విడుదలకు ముందు ఈ సినిమా పై ఎటువంటి హైప్ క్రియేట్ అవ్వలేదు. అందుకే మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా డల్ గా నమోదయ్యాయి. అయితే రెండో రోజు నుంచి మూవీ పికప్ అయ్యింది.
రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల పై షేర్ ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది. ఇక ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ మూవీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను సోనీ లివ్ సంస్థ భారీ రేటు పెట్టి కొనుగోలు చేసింది.
ఇక అక్టోబర్ 9 నుండి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. 4 వారాల వరకు ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదు అనే ఒప్పందం మేరకు ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం.