Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఒక్క క్షణం

ఒక్క క్షణం

  • December 28, 2017 / 08:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క క్షణం

మెగా ఫ్యామిలీ నుంచి కథానాయకుడిగా పరిచయమైన అల్లు శిరీష్ పరిచయ చిత్రంతో నిరాశపరిచినా అనంతరం “కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు” చిత్రాలతో హీరో మెటీరీయల్ అని ప్రూవ్ చేసుకోవాడానికి కష్టపడ్డాడు. ఈసారి మాత్రం హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ధ్యేయంతో “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నటించిన థ్రిల్లర్ “ఒక్క క్షణం”. ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా.. సినిమా మరి ఏమేరకు అలరించిందో చూద్దాం..!!okka-kshanam-movie-review-1
కథ : జీవా (అల్లు శిరీష్) తొలిచూపులో ఇనార్బిట్ మాల్ పార్కింగ్ లో పిల్లర్ నెంబర్ B57 దగ్గర చూసిన జ్యోత్స్న (సురభి)ని ప్రేమిస్తాడు. జ్యోత్స్నకి కూడా జీవా అంటే ఇష్టం ఉండడంతో వీరి ప్రేమ వెంటనే పట్టాలెక్కేస్తుంది. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్ళికి కూడా అంగీకరించి, ఇక పెళ్లే తరువాయి అనుకొంటున్న తరుణంలో జ్యోత్స్నకి తారసపడతారు శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్)-స్వాతి (సీరత్ కపూర్) జంట. శ్రీనివాస్-స్వాతిల జీవితాల్లో జరిగినట్లుగానే జీవా-జ్యోత్స్నల జీవితాల్లోనూ సంఘటనలు చోటు చేసుకొంటాయి. ఉన్నట్లుండి ఒకరోజు స్వాతిని పీకకోసి చంపేస్తాడు శ్రీనివాస్, సో, తనను కూడా జీవా అదే విధంగా చంపేస్తాడేమోనని భయపడుతుంటుంది జ్యోత్స్న. అసలు స్వాతిని చంపాల్సిన అవసరం శ్రీనివాస్ కి ఎందుకు వచ్చింది? అప్పటివరకూ అన్నీ సేమ్ టు సేమ్ జరిగాయి కాబట్టి జ్యోత్స్నని కూడా జీవా చంపేస్తాడా? అనేది తెలియాలంటే “ఒక్క క్షణం” సినిమా తప్పకుండా చూడాల్సిందే.okka-kshanam-movie-review-2
నటీనటుల పనితీరు : మునుపటి చిత్రాలతో పోల్చి చూస్తే అల్లు శిరీష్ నటుడిగా బాగా ఇంప్రూవ్ అయ్యాడనిపించకమానదు. అయితే.. హావభావాల ప్రకటనలో మాత్రం ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. సురభి ఈ చిత్రంలో అమాయకురాలి పాత్రలో అందంగా కనిపిస్తూనే అభినయంతో అలరించింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అలాగే ఎమోషన్స్ ను కూడా చక్కగా పండించింది. అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్రెజన్స్ తక్కువే అయినప్పటికీ.. నటుడిగా తన పాత్రతో కథలో మంచి ఇంపాక్ట్ తీసుకురాగలిగాడు. సీరత్ కపూర్ కూడా పర్వాలేదనిపించుకొంది. ప్రవీణ్, సత్యలు కామెడీతో కాస్త ఆకట్టుకోగా.. దాసరి అరుణ్ కుమార్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో ఆశ్చర్యపరిచాడు. అతడి క్యారెక్టర్ సినిమాకి పెద్ద ఎస్సెట్. తల్లిదండ్రులుగా కాశీవిశ్వనాధ్-రోహిణి రెగ్యులర్ రోల్స్ లో అలరించారు. okka-kshanam-movie-review-3

సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. తన నేపధ్య సంగీతంతో సన్నివేశంలోని ఎమోషన్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతోపాటు ప్రేక్షకుడ్ని సినిమాలో లీనం చేయడంలోనూ ముఖ్యపాత్ర పోషించాడు. పాటలు కూడా బాగున్నాయి. కానీ.. “సో మెనీ సో మెనీ” పాట పాపులర్ ఆంగ్ల ప్రయివేట్ మ్యూజిక్ ఆల్బమ్ “షేప్ ఆఫ్ యు”ను తలపించడం గమనార్హం.

శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా నైట్ షాట్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. షార్ప్ యాంగిల్స్ వాడడం అనేది స్క్రీన్ ప్లే పరంగా హెల్ప్ అయ్యింది.ఎడిటర్ కి మేజర్ క్రెడిట్ వెళ్తుంది. రెండు వేర్వేరు జంటల మధ్య జరిగే సంఘటనలే అయినప్పటికీ.. రిపీటెడ్ గా వచ్చే సన్నివేశాలను అర్ధవంతంగా కట్ చేశాడు. దర్శకుడి ఊహాను ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా చూపడంలో ఛోటా కె.ప్రసాద్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న వి.ఐ.ఆనంద్ “ఒక్క క్షణం” విషయంలోనూ అదే ఫార్మాట్ ను నమ్ముకొని రాసుకొన్న స్క్రీన్ ప్లే ప్రశంసార్హం. చాలా కన్ఫ్యూజన్ ఉన్న స్టోరీని ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా తెరకెక్కించిన విధానం మెచ్చుకోవాలి. అయితే.. ఈ కథ మొత్తం కీలకమలుపు తిరగడానికి గల ముఖ్యమైన అంశం చాలా పేలవంగా ఉండడం పెద్ద మైనస్. ఉదాహరణకి “ఛత్రపతి” సినిమాలో ప్రభాస్-సుప్రీత్ ల మధ్య ఫైట్ ఒక పిల్లాడ్ని రక్షించడం కోసం కాబట్టే ప్రేక్షకుడు కూడా పిడికిలి బిగించి మరీ ఆ ఫైట్ లో లీనమైపోయి మనసులో “కొట్టు కొట్టు” అంటుంటాడు. అదే ఫైట్ ఒక చాక్లెట్ కోసమే లేక సిగరెట్ కోసమే జరిగిందనుకోండి అంత ఆసక్తి ఉంటుందా.

“ఒక్క క్షణం”లో లోపించిన అంశం కూడా అదే. ప్యారలల్ స్క్రీన్ ప్లే అనే అంశం కొత్తది, పరిచయం లేని ఇద్దరి జంట జీవితాలు ఒకే విధంగా ప్రయాణించడం, ఒక జంటకి జరిగినదే మరో జంటకీ జరగడం అనేది చాలా ఆసక్తికరమైన అంశం. కథలో కనిపించినంత కొత్తదనం కాన్ఫ్లిక్ట్ పాయింట్ లో కనిపించదు. అసలు సీరత్ కపూర్ మరణానికి కానీ.. ఆ విషయం వెనుకదాగిన సీక్రెట్ సురభికి తెలియడానికి లాజిక్ ఉన్నా ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల ప్రేక్షకుడు సినిమాలో లీనమవ్వలేడు. ఆ కారణంగా సినిమా ఘన విజయం మార్క్ ని అందుకోలేదు.okka-kshanam-movie-review-5

విశ్లేషణ : రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి చూసి బాగా బోర్ ఫీలైన ప్రేక్షకులకు “ఒక్క క్షణం” మంచి రిలీఫ్ లాంటిది. అయితే.. కథలో ట్విస్ట్ అనేది ఇంకాస్త ఆసక్తికరంగా ఉండి ఉంటే సక్సెస్ రేట్ అనేది ఇంకాస్త పెద్దగా ఉండేది. ఓవరాల్ గా అల్లు శిరీష్ కి ఒక డీసెంట్ హిట్ దొరికినట్లే.

రేటింగ్ : 2.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Okka Kshanam Movie
  • #Okka Kshanam Movie Review
  • #Okka Kshanam Review
  • #Okka Kshanam Review in Telugu

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

43 mins ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

10 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

10 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

39 mins ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

1 hour ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

2 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

6 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version