రీ రిలీజ్ సినిమాల హడావిడి మహేష్ బాబు ‘పోకిరి’ తో మొదలైంది. పాత ప్రింట్ ను 4K కి డిజిటలైజ్ చేసి మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒక్కరోజు ప్రదర్శితమైనప్పటికీ మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో జనవరి 7న ఆ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేశారు.
అయితే ఇటీవల రీ రిలీజ్ అయిన ‘ఖుషి’ చిత్రానికి చేసిన ప్రమోషన్ ‘ఒక్కడు’ రీ రిలీజ్ కు చేయలేదు. అందుకే ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు కొట్టలేదు కానీ.. మంచి కలెక్షన్లనే సాధించింది. ‘ఒక్కడు'(4K) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
1.40 cr
సీడెడ్
0.36 cr
ఆంధ్ర
1.19 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
2.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.22 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.17 cr
‘ఒక్కడు'(4K) రీ రిలీజ్ లో టోటల్ గా రూ.3.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ మార్క్ అయితే రూ.4.95 కోట్లు ఉంది. రీ రిలీజ్ లో ఈ చిత్రానికి 3 రోజులు టైం మాత్రమే లభించింది. ఓవర్సీస్ లో రిలీజ్ కాలేదు. కనీసం ఈ సినిమాని చిత్ర బృందం ప్రమోషన్ కూడా చేయలేదు.
‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ లో గుణశేఖర్ స్పందించాడు తప్ప.. అసలు ఇండస్ట్రీ ‘ఒక్కడు’ రీ రిలీజ్ చాలా వరకు పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకుని ఉంటే లెక్క వేరేలా ఉండేది అనడంలో సందేహం లేదు.