Okkadu re-release: సూపర్ స్టార్ మహేష్ ఒక్కడు మూవీ రీరిలీజ్.. కానీ?

2023 సంక్రాంతి పండుగకు ఏ స్థాయిలో పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఆరు సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల కానుండగా ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు లభిస్తాయనే చర్చ జరుగుతోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో థియేటర్ల సమస్య చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2023 సంక్రాంతి పండుగ సమయంలో మహేష్ నటించిన ఒక్కడు మూవీ రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినా ఎం.ఎస్.రాజుకు మంచి లాభాలను అందించింది.

జనవరి నెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సంక్రాంతి సినిమాల కంటే మూడు రోజుల ముందు ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. మహేష్ నటించిన పోకిరి మూవీ రీ రిలీజ్ లో కూడా మంచి కలెక్షన్లను సాధించి ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది.

అయితే ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాల రీ రిలీజ్ లకు మంచి రెస్పాన్స్ రావడం లేదు. ఒక్కడు మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మణిశర్మ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఒక్కడు మూవీలో మహేష్ కు జోడీగా భూమిక నటించారు.

మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ కు సంబంధించి త్వరలో అప్ డేట్ రానుంది. ప్రస్తుతం మహేష్ బాబు వెకేషన్ లో ఉన్నారు. త్రివిక్రమ్ ఈ సినిమా షూట్ ను వేగంగానే పూర్తి చేయనున్నారని గత సినిమాలకు భిన్నంగా త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో ముందుకు వెళుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus