బాలయ్యను వదలనంటూ మారం చేసిన భామ.. వీడియో వైరల్ .!

ఎన్టీఆర్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘ఆంధ్రావాలా’ సినిమాని అభిమానులు అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. కానీ ఇందులో కొన్ని కామెడీ సీన్లు ఇప్పటికీ యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో బ్రహ్మానందం – పావలా శ్యామల… మధ్య వచ్చే కామెడీ సీన్ అయితే హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమాలో హోమ్ మినిస్టర్ పాత్ర పోషించిన బ్రహ్మానందం ఓ సీన్ లో ఎన్టీఆర్ నిరాహార దీక్ష చేస్తున్న బస్తీకి వచ్చి..

వారికి నచ్చజెప్పి ఆ నిరాహార దీక్ష విరమించుకునేలా చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో పావలా శ్యామల ప్రతీసారి హోమ్ మినిస్టర్ అయిన బ్రహ్మీ పై పడుతూ ఉంటుంది. ఈ సీన్ కి నవ్వని వారంటూ ఉండరేమో..! సరిగ్గా ఇలాంటి సీన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా జరగడం విశేషంగా చెప్పుకోవాలి. వివరాల్లోకి వెళితే… బుధవారం నాడు బాలయ్య, అఖండ భామ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి విజయవాడలోని ఓ నగల దుకాణాన్ని ప్రారంభించేందుకు వెళ్ళాడు.

అనంతరం బాలయ్య మైక్ లో మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ బామ్మ బాలయ్య వద్దకు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది. బాలయ్య కూడా ఆమె అభిమానం చూసి ఆప్యాయంగా భుజం మీద చేయి వేశాడు.కానీ ఎంతటికీ ఆమె అక్కడి నుండి వెళ్లడం లేదు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది ఆమెని కిందకు వెళ్లమని కోరగా.. ఆమె బాలయ్యను పట్టుకుని వదలను అన్నట్లు తల ఊపుతూ మారం చేసింది.

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘పెద్దావిడ కాబట్టి బాలయ్య ఊరుకున్నాడు కానీ.. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చెంప చెళ్లుమనిపించేవాడు’ అంటూ ఈ వీడియో చూసిన వారు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus