Om Bheem Bush Teaser Review: ‘బ్రోచేవారెవరురా’ కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. టీజర్ ఎలా ఉందంటే?

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబోలో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఆ సినిమాతో ఈ ట్రియో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. కొంత గ్యాప్ తర్వాత ఇదే కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. అదే ‘ఓం భీమ్ బుష్’. ‘హుషారు’ ‘రౌడీ బాయ్స్’ వంటి యూత్ ఫుల్ సినిమాలు రూపొందించిన శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ సమర్పణలో ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మార్చి 22 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక టీజర్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1 నిమిషం 43 సెకన్ల నిడివి కలిగి ఉంది. బ్రోచేవారెవరురా ..లో ఆర్.ఆర్.ఆర్ గా కనిపించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఈ సినిమాలో (Om Bheem Bush) బాంగ్ బ్రోస్ గా కనిపిస్తున్నారు.

నిధి అన్వేషణ కోసం ఈ ముగ్గురు ఒక గ్రామానికి రావడం ఆ తర్వాత జరిగే పరిణామాల నేపధ్యంలో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. టీజర్లో ఎంటర్టైన్మెంట్ కి ఢోకా లేదు అనే చెప్పాలి. రాజ్ తోట సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది. సన్నీ ఎం ఆర్ సంగీతం కూడా చాలా డిఫెరెంట్ ఫీల్ ను కలిగించింది. మరోసారి శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి..ల కాంబో అలరించే విధంగా కనిపిస్తుంది. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus