ఓం నమో వెంకటేశాయ 3 డేస్ కలక్షన్స్
- February 14, 2017 / 01:43 PM ISTByFilmy Focus
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కింగ్ నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం ఈ నెల 10వ తేదీన రిలీజ్ అయి సక్సస్ టాక్ సొంతం చేసుకుంది. హథీరాం బాబాగా నాగ్ నటించిన ఈ మూవీ విడుదలైన తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 .40 కోట్లు కలక్షన్స్ రాబట్టింది. అందరూ సినిమా బాగుందని చెప్పడంతో రెండోరోజు అయిన శనివారం థియేటర్ కి ప్రేక్షకుల తాకిడి పెరిగింది. దీంతో సెకండ్ డే 4.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం కూడా అదే జోరు కనిపించింది. మూడో రోజు 4.25 కోట్లు కలెక్ట్ చేసింది.
మూడు రోజులకు భక్తిరసాత్మక చిత్రం 10 .75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా థియేటర్ హక్కులు 24 .65 కోట్లకు అమ్ముడుపోయాయి. పంపిణీదారులకు అసలు రావాలంటే మరో 15 కోట్లు రావాల్సి ఉంది. ఆ మొత్తాన్ని ఈ వారంలో వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ వారం నుంచి ‘ఓం నమో వేంకటేశాయ’ లాభాలను అందించవచ్చని భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












