Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?
- July 14, 2026 / 03:29 PM ISTByPhani Kumar
అక్కినేని నాగార్జున ఇప్పుడు పుత్రోత్సాహంలో ఉన్నారు. ఇటీవల ఆయన చిన్న కొడుకు అఖిల్ నటించిన ‘లెనిన్'(Nagarjuna) సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అఖిల్ కి ఇది తొలి బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంతకు ముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ డీసెంట్ హిట్ అనిపించుకున్నప్పటికీ.. అది ‘లెనిన్’ రేంజ్ మాస్ హిట్ కాదు. ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ‘లెనిన్’ మరింతగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
Nagarjuna
వీక్ డేస్ లో నిలకడగా రాణిస్తే.. రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా అధిగమించొచ్చు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘లెనిన్’ సక్సెస్ లో అఖిల్ కి మాత్రమే కాదు నాగార్జునకి కూడా మేజర్ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాత. నాగవంశీతో కలిసి నిర్మించారు. వాస్తవానికి ‘లెనిన్’ కథని ఓకె చేసి అఖిల్ వద్దకి పంపింది నాగవంశీనే..! ఆయనే సొంతంగా ఈ సినిమాని నిర్మించాలి అనుకున్నాడు.

కానీ నాగార్జున ఈ ప్రాజెక్టుని పర్సనల్ గా టేకప్ చేయడానికి పార్ట్నర్ గా జాయిన్ అయ్యారు. స్క్రిప్ట్ లో మొదటి నుండి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే సీన్లు అనుకున్నట్టు వచ్చే దాకా రీషూట్లు చేయించారు. అలా ‘లెనిన్’ కి ఆయన బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. అంతేకాదు సక్సెస్ మీట్లో నాగార్జున కొన్ని విలువైన మాటలు కూడా చెప్పారు. అవేంటంటే..’లెనిన్’ కి చాలా వరకు ‘శివ’ ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాల వర్కింగ్ స్టైల్ ని ఫాలో అయ్యారట.
ఆ సినిమాలకి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే బేధం లేకుండా ప్రతి సన్నివేశానికి అందరి నటీనటులు సహకరించారట. షూటింగ్ టైమ్లో నటీనటులంతా ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేసేవారని నాగార్జున చెప్పారు. ‘లెనిన్’ కి ‘శివ’ ‘నిన్నే పెళ్ళాడతా’ వర్కింగ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్లనే ఇలాంటి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనేది ఆయన అభిప్రాయం. మరి ఈ విషయాలను ప్రెజెంట్ జెనరేషన్ ఫిల్మ్ మేకర్స్ ఎంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.
వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం











