Raju Gari Gadhi 4: ఓంకార్‌కి ‘గది’ సరదా పోలేదా…

  • June 14, 2021 / 01:26 PM IST

భయపెట్టి… నవ్వించడం అనే జోనర్‌ సినిమాలు తెలుగులో కొత్తగా వచ్చిన రోజుల్లో ‘రాజు గారి గది’ వచ్చి మంచి విజయం అందుకుంది. అప్పటివరకు బుల్లితెర హోస్ట్‌గా ఉన్న ఓంకార్‌… ఆ సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో ఆ సిరీస్‌లో మరో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. అయితే ఇప్పుడు నాలుగో ‘రాజు గారి గది’ తీసుకురాబోతున్నాడట. అదీ మేటర్‌.‘రాజు గారి గది’ సిరీస్‌లో తొలి సినిమా మంచి విజయం అందుకుంది.

దీంతో ఓంకార్‌ దర్శకుడిగా మరిన్ని జోనర్లు టచ్‌ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్నట్లుగా కాకుండా, అదే జోనర్‌లో వరుస సినిమాలు చేశాడు. ఇప్పుడూ అదే చేయబోతున్నాడట. తన తమ్ముడు, తొలి మూడు సినిమాల్లో కీలక పాత్రలో కనిపించిన అశ్విన్‌ను హీరోగా పెట్టి నాలుగో ‘రాజు గారి గది’ రూపొందిస్తాడట. ప్రస్తుత కాలంలో ఇది హారర్‌ కామెడీ సబ్జెక్ట్‌లు వర్కౌట్‌ అవ్వడం లేదు. చాలామంది ఈ తరహా ప్రయత్నాలు చేసినా సక్సెస్‌ అవ్వలేదు.

అయితే తనది కాని చోట కూడా నిరూపించుకునే తత్వం ఓంకార్‌ ది. ఈ లెక్కన ఎవరికీ వీలుకానిది ఈ సినిమాతో చేసి చూపిస్తాడేమో చూడాలి. లేకపోతే గత రెండు సినిమాల్లాగే థియేటర్‌లో జనాలను, ఆ సినిమా వేసిన థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్‌లను నిరాశపరుస్తాడా అనేది తెలియాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus