సంక్రాంతి సినిమాలకి మరో షాకిచ్చిన ఏపి ప్రభుత్వం..!

  • January 7, 2022 / 05:23 PM IST

ముందు నుండీ సినీ జనాలు భయపడినట్టే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ మొదలవ్వబోతుంది. రేపటి నుండీ కరోనా ఆంక్షలను విధించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాత్రి 10 గంటల నుండీ ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించబోతుంది. సినిమా థియేటర్లు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ అవుతాయి. ఇప్పటికే అక్కడ టికెట్ రేట్ల ఇష్యు కారణంగా ఇప్పటివరకు విడుదలైన పెద్ద సినిమాలేవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇలాంటి నేపథ్యంలో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకి ఇబ్బంది తప్పదు.

ఈ సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’ ‘భీమ్లా నాయక్’ ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద సినిమాలు విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతుండడం, పక్క రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడడంతో ముందు జాగ్రత్తగా వాటి విడుదలని వాయిదా వేశారు మేకర్స్. దాంతో ఈ సంక్రాంతికి ‘ఒక్క బంగార్రాజు’ తప్ప అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. నిజానికి చిన్న సినిమాలకి థియేటర్లు రన్ అయితే సరిపోతుంది. కానీ ‘బంగార్రాజు’ చిత్రం ప్రేక్షకులందరికీ ఫస్ట్ ఆప్షన్ గా మారింది.

‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి హిట్టు సినిమాకి సీక్వెల్ కాబట్టి.. ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.అందుకే టికెట్ రేట్లనేవి తన సినిమాకి ప్రాబ్లమ్ కాదని నాగార్జున చెప్పకనే చెప్పాడు. అయితే ఇప్పుడు కేవలం 3 షోలకు మాత్రమే ఏపిలో అనుమతి ఉంది… అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే..! మరి ఇప్పుడు ‘బంగార్రాజు’ పరిస్థితేంటో..! విడుదలకు ముస్తాభవుతాడా లేక వెనక్కి వెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus