పాన్ ఇండియా స్టార్.. ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తూనే ఉన్నాడుగా..!

‘బాహుబలి’ (సిరీస్) అంటే రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కింది కాబట్టి.. దానికి 4 ఏళ్ళ వరకూ టైం పట్టింది. అందుకు ఫ్యాన్స్ కూడా మొదటి నుండీ సిద్ధపడే వెయిట్ చేస్తూ వచ్చారు.’ ‘బాహుబలి’ తరువాత నుండీ ప్రభాస్ ఏడాదికి రెండేసి సినిమాలు చేస్తాను’ అని చెప్పి అభిమానులకు మాట ఇచ్చాడు. కాబట్టి అందుకు ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషపడ్డారు. కానీ ‘బాహుబలి’ తో ప్రభాస్ రేంజ్ పెరిగింది.. ఇండియన్ లెవెల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దాంతో తాను నటించే తరువాతి సినిమాలు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ తెరకెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ విధంగా.. అన్ని భాషల్లో క్రేజ్ ఉన్న స్టార్ క్యాస్ట్ ను తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్ డైరెక్టర్లు. ‘సాహో’ దర్శకుడు సుజీత్ అలాగే రెండేళ్ళు ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఇప్పుడు ‘ప్రభాస్ 20’ డైరెక్టర్ రాధా కృష్ణకుమార్ కూడా అంతే..! సరే సినిమాలు ఎలాగూ లేట్ అవుతున్నాయి. కనీసం నిర్మాతలు అప్డేట్స్ అయినా ఇస్తున్నారా అంటే అదీ లేదు. లాక్ డౌన్ కు ముందే ‘ప్రభాస్ 20’ కి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని..ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తామని.. దర్శకుడు రాధా కృష్ణకుమార్ తెలియజేసాడు.

కానీ నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు మాత్రం దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. వాళ్ళు ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే వరకూ ఎటువంటి అప్డేట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారట. ఈ నెలలో షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు వైరస్ మహమ్మారి కారణంగా కేసులు పెరగడంతో మరో రెండు నెలల వరకూ షూటింగ్ ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తుంది. అంటే మరో రెండు నెలల వరకూ ‘ప్రభాస్ 20’ టైటిల్ కానీ.. ఫస్ట్ లుక్ కానీ విడుదల అయ్యే ఛాన్స్ లేదన్న మాట.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus