Director Teja: అప్పటి మ్యూజిక్‌ మ్యాజిక్‌ కోసం జనాలు వెయిటింగ్‌

  • May 16, 2021 / 02:53 PM IST

డైరక్టర్‌ అండ్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ కాంబో అనేది టాలీవుడ్‌ చాలా కీలకంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ ఇద్దరిక కలయిక గురించి మన సినిమా జనాలు, ప్రేక్షకులు తెగ మాట్లాడుకుంటారు. అలాంటి కాంబోల్లో తేజ, ఆర్పీ పట్నాయక్‌ ఒకటి. ‘చిత్రం’తో మొదలైన వీరి ప్రయాణం ‘నువ్వు నేను’, ‘జయం’ లాంటి హిట్‌ మూవీస్‌ అందించింది. అయితే ఆ తర్వాత ఇద్దరి కలయిక కుదర్లేదు. ఇద్దరూ వేర్వేరుగా సినిమాలు తీసి, వావ్‌ అనిపించుకున్నారు. అయితే అదే జోరులో కిందపడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ కలుస్తున్నారని తెలుస్తోంది.

జంట ప్రయాణంలో హిట్లు కొట్టిన తేజ, ఆర్పీ పట్నాయక్‌, విడివిడిగా సినిమాలు చేసి కూడా విజయాలు అందుకున్నారు. అయితే కొన్ని నిర్ణయాల కారణంగా పరాజయాలు చవిచూశారు. చాలా కాలంగా పరిశ్రమకు అంటీముట్టనట్లు ఉన్నారు. అయితే ‘నేనే రాజు నేనే మంత్రి’తో తేజ తిరిగి స్వింగ్‌లోకి వచ్చారు. కానీ ఆర్పీకి ఆ అవకాశం లేదు. అయితే రీఎంట్రీని తేజ సినిమాతోనే ఘనంగా ఇవ్వాలని అనుకుంటున్నారని సమాచారం. దీని కోసం ‘చిత్రం 1.1’ సినిమాను ఎంచుకున్నారట.

50 మంది కొత్తవారితో తేజ ‘చిత్రం’ సీక్వెల్‌ను తీస్తారని వార్తలొచ్చాయి. అయితే కరోనా కారణంగా ఆగిపోయిందని అన్నారు. కానీ సురేశ్‌బాబు తనయుడు అభిరామ్‌ దగ్గుబాటిని హీరోగా పెట్టి ఆ సినిమానే తీస్తారని ఇప్పుడు మళ్లీ వార్తలొస్తున్నాయి. ఆ సినిమాకే ఆర్పీ పట్నాయక్‌ సంగీతం ఇస్తారని టాక్‌. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరూ కలుస్తున్నారు కాబట్టి అభిమానులు మంచి పాటలు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. మరి నేటితరం సంగీత దర్శకుల్ని బీట్‌ చేసేలా ఆర్పీ ఎలాంటి సంగీతం ఇస్తాడో చూడాలి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus