క్రికెటర్ల జీవితం సినిమాలుగా మలిస్తే… మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఏ క్రికెటర్ల బయోపిక్ కూడా ఫెయిల్ అవ్వలేదు. సచిన్ తెందూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ.. మొన్నీ మధ్య వచ్చిన ‘83’… ఇలా ఏదీ ఫెయిల్ అవ్వలేదు. అలాంటి రికార్డు ఉన్న క్రికెట్ నుండి ఓ స్టార్ క్రికెటర్ సినిమా వస్తుంది అంటే… ఎవరైనా నో అంటారా? కానీ ఒక క్రికెటర్ విషయంలో అలాంటి మాట వినిపించింది. అతనే ముత్తయ్య మురళీథరన్.
శ్రీలంకకు చెందిన ఈ ప్రముఖ క్రికెటర్ జీవితంలో ఆధారంగా ‘800’ అనే పేరుతో సినిమా అనౌన్స్ చేసి… హీరో ఎవరో చెప్పి ఆ తర్వాత ఆపేశారు. మురళీథరన్ జీవితాన్ని కళ్లకు కట్టడానికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. దీంతో ఇక రచ్చ రచ్చే అని అందరూ అనుకున్నారు. విజయ్ సేతుపతి కూడా పూర్తి మేకోవర్‌తో పాత్రకు రెడీ అయిపోయాడు. అయితే గతంలో జరిగి యాంటీ తమిళ్ వ్యవహారం ఇప్పుడు చర్చకు వచ్చింది.
తమిళులకు వ్యతిరేకంగా ఉన్న మురళీ థరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమాలో తమిళుడైన నువ్వు నటించడమేంటి అంటూ విజయ్ సేతుపతి మీద విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున బెదింపు కాల్స్ మొదలయ్యాయి. దీంతో ఆ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. దాంతో సినిమా ఇక ఆగిపోయినట్లే అని అనుకున్నారు. కానీ ఆ సినిమాను తలకెత్తుకున్న దర్శకుడు ఎమ్మెస్ శ్రీపతి మాత్రం వెనకంజ వేయడం లేదు. మురళీథరన్ జీవితాన్ని పక్కాగా సినిమా చేస్తా అని పట్టుపడుతున్నాడు.
ఈసారి ఇంటర్నేషనల్ స్టార్ దేవ్ పటేల్‌ను సినిమాలోకి తీసుకొచ్చాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో దేవ్ మనకు పరిచయం అయ్యాడు. ‘హోటల్ ముంబై’, ‘ది వెడ్డింగ్ గెస్ట్’, ‘ది గ్రీన్ నైట్’ అనే సినిమాలతో మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆ హీరోతోనే ‘800’ సినిమా చేయాలని దర్శకుడు శ్రీపతి అనుకుంటున్నాడట. అన్నీ ఓకే అయితే త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం. అయితే మరి ఈ సినిమా విషయంలో తమిళనాట ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. తమిళుడు నటించలేదు కాబట్టి… ఓకే అంటారో. లేక అసలు సినిమానే వద్దంటారో చూడాలి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!