“పద్మావతి” సినిమాలో తప్పేముందో సినిమా చూసిన ప్రేక్షకులకు ఇప్పటికీ అర్ధం కాలేదు. అలాగే.. అసలు కర్ణిసేన ఎంతో కష్టపడి చెమటోడ్చి మరీ కొన్ని వందల కోట్ల ప్రభుత్వ-ప్రజల ఆస్తిని ధ్వంసం చేసి మరీ “పద్మావతి” చిత్రాన్ని ఎందుకు ఆపేయాలనుకొందో కూడా ప్రజలకు సరైన అవగాహన లేకుండాపోయింది. “సినిమాలో పద్మావతి మహారాణిని ఏదో సినిమా హీరోయిన్ గా అసహ్యంగా చూపిస్తున్నారు, ఖిలిజీ-పద్మావతీల నడుమ భన్సాలీ ఒక రోమాంటిక్ సాంగ్ తీశారు, రాజ్ పుత్ ల ఆత్మ గౌరవాన్ని “పద్మావతి” సినిమా పాడు చేస్తుంది, రాజ్ పుత్ మహిళల గౌరవాభిమానాల్ని “పద్మావతి” సినిమా నేలరాల్చుతుంది” అంటూ కర్ణిసేన నిన్నమొన్నటివరకూ “పద్మావతి” సినిమా ప్రదర్శిస్తున్న థియేయర్లపై దాడి చేయడమే కాక పదర్శనలు ఆపేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు.
ఇంత హడావుడి చేసి.. చాలా సింపుల్ గా “పద్మావతి చిత్రంలో తప్పేమీ లేదు, పైగా రాజ్ పుత్ ల గౌరవాన్ని, ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది” అంటూ స్టేట్ మెంట్ జారీ చేసింది. ఈ స్టేట్ మెంట్ చేసి పద్మావతి చిత్రబృందాని కంటే ఎక్కువగా సగటు ప్రేక్షకులు ఎక్కువగా ఆశ్చర్యపోయారు. ఇంత హడావుడి చేసే బదులు సినిమాని భన్సాలీ చూపిస్తానన్నప్పుడు చూసుంటే ఇంత గోల ఉండేది కాదుకదా అంటున్నారు. నిజమే కదా కర్ణిసేన “పద్మావతి” చిత్రాన్ని విడుదలకు ముందు ఒక్కసారి వీక్షించి ఉంటే ఇంత హడావుడి ఉండేది కాదు.