Mahesh Babu, Sukumar: ఆ బాకీని సుకుమార్ తీర్చుకుంటారా?

మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమా భారీస్థాయిలో కలెక్షన్లు సాధించకపోయినా అటు మహేష్ బాబుకు, ఇటు సుకుమార్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. మహేష్ అభిమానులతో పాటు క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. అయితే ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు మాత్రం భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. 1 నేనొక్కడినే సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా హిట్ కావడం గమనార్హం.

మరోవైపు పుష్ప ది రైజ్ కథను సుకుమార్ మహేష్ బాబుకు వినిపించగా కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ సినిమాలో నటించలేదు. పుష్పరాజ్ పాత్ర కొంతమేర నెగిటివ్ టచ్ తో ఉండటం మరీ మాసివ్ గా ఉండటంతో మహేష్ పుష్ప సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. పుష్ప ది రైజ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మహేష్ ఈ కథను రిజెక్ట్ చేసి తప్పు చేశాడని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మహేష్ అభిమానులు మాత్రం మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 1 నేనొక్కడినే ఫ్లాప్ తో మిగిలిన బాకీని తర్వాత సినిమాతో సుకుమార్ తీర్చుకోవాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సినిమాల తర్వాత మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. సుకుమార్ పుష్ప ది రూల్ తర్వాత విజయ్ దేవరకొండతో ఒక సినిమాను, రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. ఇటు మహేష్ అటు సుకుమార్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం గమనార్హం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus