2020 సంక్రాంతికి విడుదలైన అల్లు అర్జున్- త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ చిత్రం అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పక్కనే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బడా సినిమా ఉన్నప్పటికీ.. ‘అల వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలవడం మామూలు విషయం కాదు. అల్లు అర్జున్, మురళీ శర్మ ల నటన.. హీరోయిన్ పూజా హెగ్డే గ్లామర్.. తమన్ మ్యూజిక్.. త్రివిక్రమ్ రైటింగ్ మరియు డైరెక్షన్ కలగలిపి ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ‘బాహుబలి1’ రికార్డులను కూడా అధిగమించింది.
పాన్ ఇండియన్ లెవెల్లో విడుదల కాకపోయిన ఈ చిత్రం ఆ స్థాయి విజయాన్ని సాధించడం ఓ రికార్డు అనే చెప్పాలి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘అల వైకుంఠపురములో’ చిత్రం ప్రీమియర్ ఆలస్యంగా టీవీల్లో టెలికాస్ట్ అయినప్పటికీ 29.4 రికార్డు టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. జెమినీ టీవీ వారు ఈ చిత్రాన్ని మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడే.. లాభాల బాట పట్టారు. ఇక రెండో సారి కూడా ఈ చిత్రం మంచి టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేస్తుంది అని అంతా అనుకున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 23.4 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చెయ్యగా..
దానిని ఈజీగా అధిగమించింది ‘అల వైకుంఠపురములో’. ఇక రెండో సారి కూడా ‘సరిలేరు’ 17 పైనే టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. కానీ ‘అల వైకుంఠపురములో’ మాత్రం రెండోసారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 7.9 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది. రెండోసారి ‘అల’ పెద్దగా పెర్ఫార్మ్ చెయ్యలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది డీసెంట్ టి.ఆర్.పి నే .. అందులోనూ దీపావళి రోజున టెలికాస్ట్ అయ్యి ఈ స్థాయి టి.ఆర్.పి నమోదు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?