ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల షూటింగ్ నత్త నడకన జరుగుతుండటం ఫ్యాన్స్ ను ఒకింత బాధ పెడుతోంది. మహేష్ ప్రతి సినిమా రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంటూ ఉండటం గమనార్హం. అయితే మహేష్ ప్రస్తుతం నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో రాజకీయాలను టచ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో రాజకీయ నాయకుని పాత్రలో కనిపించనున్నారని భోగట్టా. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ కాగా లీకైన ఫోటో ద్వారా ఈ విషయాలకు సంబంధించి స్పష్టత వచ్చేసింది.
జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైర వెంకటస్వామి పాత్రలో ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. 80 సంవత్సరాల వయస్సు ఉన్న పాత్రను ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో పోషిస్తున్నారని సమాచారం అందుతోంది. నిజామాబాద్ జిల్లా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా షూట్ జరగనుంది. మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహేష్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా విడుదలవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేష్ (Mahesh Babu) పాత్రకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. మహేష్ ఈ సినిమా కోసం 78 కోట్ల రూపాయల పారితోషికం, జీఎస్టీ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో మహేష్ కు మరిన్ని భారీ విజయాలు దక్కాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. గుంటూరు కారం సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు