Nani, Dilraju: ఎం.సి.ఎ కాంబోలో మరో క్రేజీ మూవీ..!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతిలో ఇప్పుడు స్టార్ హీరోలు లేరు. ఒకప్పుడు ఆయన 3 చిన్న సినిమాలు తీస్తుంటే మరోపక్క 2 పెద్ద సినిమాలు కూడా ప్లాన్ చేసేవారు. అయితే ఇప్పుడు ఒక్క రాంచరణ్ తప్ప టాలీవుడ్లో మరే స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు. సీనియర్ స్టార్ హీరోలది కూడా అదే పరిస్థితి. దీంతో దిల్ రాజు మిడ్ రేంజ్ హీరోల పై కన్నేశాడు. దిల్ రాజు బ్యానర్లో నాని ఓ సినిమా చేయాలి.

వీరి కాంబోలో ‘నేను లోకల్’ ‘ఎం.సి.ఎ’ ‘వి’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో ‘వి’ అంతగా ఆడలేదు కానీ మిగిలిన రెండు సూపర్ హిట్లు అయ్యాయి. మరీ ముఖ్యంగా ‘ఎం.సి.ఎ’ చిత్రం నాని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మిగిలింది. ఇప్పుడు ‘ఎం.సి.ఎ’ కాంబోలోనే మరో చిత్రం రూపొందించాలనేది దిల్ రాజు ప్లాన్. దర్శకుడు వేణు శ్రీరామ్ కి కూడా స్టార్ హీరోలు దొరకడం లేదు. ‘వకీల్ సాబ్’ తర్వాత దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉన్నాడు అతను.

అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ ఇప్పట్లో కుదిరేలా లేదు. దీంతో అతను ఆ సినిమాపై ఆశలు వదిలేసుకున్నాడు. చాలా రోజుల క్రితం వేణు శ్రీరామ్ ఓ కథ రెడీ చేసుకుని దిల్ రాజుకి వినిపించాడు. ఆ కథ నచ్చడంతో వెంటనే దానికి ‘తమ్ముడు’ అనే టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ చేసి ఉంచారు.

నాని కూడా వేణుతో మళ్ళీ సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇన్నాళ్టికి ఈ కాంబో మళ్ళీ ఫిక్స్ అయ్యింది అని స్పష్టమవుతుంది. అతని 30వ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus