నెగటివ్ రోల్ అయినా? పాజిటివ్ రోల్ అయినా.. వందశాతం నటించగల నటులు తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువమందే ఉన్నారు. అటువంటి వారిలో మోహన్ బాబు ఒకరు. హీరో గా.. విలన్ గా నటించడమే కాదు.. రెండింటిలో సీరియస్.. కామెడీ రెండు వెర్షన్లను చూపించారు. ఈ మధ్య అతనికి తగ్గ పాత్రలు దొరకలేదు. అందుకే మోహన్ బాబు నటించిన సినిమాలు వస్తున్నా… అతను కనిపించడంలేదు. ఇన్నాళ్లకి ఓ మంచి రోల్ దొరికినట్లు తెలిసింది. అయితే అది పాజిటివ్ రోల్ కాదు.. మెయిన్ విలన్ రోల్. విక్టరీ వెంకటేష్ తో ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ కొంగర మంచి కథ రాసుకుందంట. దానిని సూర్యకి చెప్పడంతో ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు తెలిసింది.
ఈ కథని ఒకేసారి తెలుగు, తమిళ భాషలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. అందుకే విలన్ గా ఎవరు నటిస్తే బాగుంటుందని సుధ ఆలోచిస్తుండగా మోహన్ బాబు పేరును సూర్య చెప్పారంటా. అతను సలహా మేరకు సుధ కొంగర ఇటీవలే మోహన్ బాబును కలిసి కథను చెప్పి ఒప్పించినట్లుగా ఫిలిం నగర్ వాసులు చెప్పారు. చాలాకాలం తర్వాత మోహన్ బాబు విలన్ రోల్ పోషిస్తుండడంతో ఈ వార్త టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. లెజెండ్ మూవీతో జగపతిబాబు సినీ కెరీర్ గ్రాఫ్ హీరో కంటే ఎన్నో రెట్లు పెరిగింది. మరి ఈ సినిమా తర్వాత మోహన్ బాబు కెరీర్ వేగం పుంజుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.