Naga Chaitanya: చైసామ్ కాంబోలో మూవీ.. ఫ్యాన్స్ కు పండగే..?

గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఏమాయ చేశావె సినిమాలో నటించిన చైతన్య సమంత ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తరువాత చైతన్య సమంత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో ఆటో నగర్ సూర్య మినహా మిగిలిన రెండు సినిమాలు హిట్ ఫలితాన్ని అందుకున్నాయి. అయితే చైతన్య మళ్లీ సమంతతో రొమాన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో చైతన్య నటించనున్నారు. మనం సినిమా తరువాత నాగార్జున, చైతన్య కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో చైతన్యకు జోడీగా సమంత నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారకంగా ఈ మేరకు ప్రకటన రావాల్సి ఉండగా వైరల్ అవుతున్న ఈ వార్త వల్ల చైసామ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సినిమాలో చైతన్య, సమంత భార్యాభర్తలుగానే కనిపిస్తారని తెలుస్తోంది. అఖిల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సోగ్గాడే చిన్నినాయన భారీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ సినిమా విడుదల కానుంది. 2022 సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేద్దామని నాగార్జున భావిస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus