Naga Vamsi: సోషల్ మీడియాకి ఫీస్ట్ ఇవ్వడం కోసమే నాగ వంశీ ప్రెస్మీట్లు?

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న అగ్ర నిర్మాత సంస్థల్లో ఒకటి. అయితే ఈ సంస్థలో వచ్చే సినిమాల కంటే.. వాటి ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసే ప్రెస్మీట్లే ఎక్కువ హాట్ టాపిక్ అవుతుంటాయి. విషయం ఏంటంటే.. నిన్న ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నాగ వంశీ (Naga Vamsi) ప్రెస్ మీట్ అంటే.. మొత్తం హాట్ టాపిక్ అయ్యేది అతనే. మీడియాకి స్టఫ్ ఇవ్వడం కోసమే ‘అతను ప్రెస్మీట్ పెడతాడు’ అని అంతా భావిస్తూ ఉంటారు.

Naga Vamsi

ఎలాంటి ప్రశ్న వేసినా తన శైలిలో సమాధానం. ముఖ్యంగా సెటైరికల్ గా సమాధానాలు ఇవ్వడం అనేది నాగవంశీ (Naga Vamsi) స్టైల్. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నాగవంశీ మాత్రమే కాదు.. ‘మ్యాడ్ స్క్వేర్’ టీం అంతా మీడియాపై సెటైర్లు వేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపించింది. మీడియా వాళ్ళు ఎలాంటి ప్రశ్న వేసినా.. టీజర్లోని ఏదో ఒక పంచ్ లైన్ తో వాళ్ళు స్పందించారు. నార్నె నితిన్, రామ్ నితిన్ సైలెంట్ గా ఉన్నా..

మరో హీరో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), దర్శకుడు కళ్యాణ్ శంకర్..లు నాన్ స్టాప్ గా మీడియాపై సెటైర్లు వేయడం జరిగింది. కొంచెం ఆలస్యంగా స్టేజ్ ఎక్కిన నాగవంశీ.. ఎక్కడా తగ్గలేదు. ‘సినిమాలో హీరోయిన్లని మార్చేశారు.. ఎందుకు?’ అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తే.. దానికి నాగవంశీ… ‘సినిమాలో అమ్మాయిలు హీరోయిన్లు లేకపోతే మీరు డిప్రెషన్ కి వెళ్ళిపోతారు కదా.. అందుకే ప్రతి 10 నిమిషాలకు ఒక్కో హీరోయిన్ వచ్చి వెళ్లేలా ప్లాన్ చేశాం’ అంటూ చమత్కరించాడు. ఇలాంటివి చాలానే ఉన్నాయి.

అలా అని మీడియా వారు ఏమైనా ఫార్మల్ గా ప్రశ్నలు అడుగుతున్నారా? అంటే అది కూడా లేదు. సినిమా టీం వాళ్ళు సెటైర్లు వేయడానికి కరెక్ట్ గా సరిపోయినట్టు అడిగారు. ఒక రిపోర్టర్ ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్లో ‘చిన్నాన్న సారీ పెదనాన్న’ అనే డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంది. అది అర్థం కానట్టు ‘ఆ డైలాగ్ కి అర్ధం ఏంటి?’ అంటూ టీంని ప్రశ్నించడం ఘోరమైన విషయం. ఏదేమైనా ‘సితార’ వారి ప్రెస్మీట్లు అంటే మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చే వేదికలుగా మారిపోయినట్టు సోషల్ మీడియాలో అంతా అనుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus