‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్ వేడుకకి గెస్ట్ గా వెళ్ళిన నాని.. ‘థియేటర్ల గొప్పతనం గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. సినిమాని నమ్ముకుని కొన్ని వేల మంది బ్రతుకుతున్నారని… ఏదైనా విపత్తు వస్తే ముందుగా థియేటర్లనే ఎందుకు ముందుగా మూసేస్తున్నారు’ అంటూ నాని గళమెత్తాడు. దీంతో ఆ టైములో నాని పై ప్రశంసలు కురిసాయి.అయితే ఆ వెంటనే నాని నటించిన ‘టక్ జగదీష్’ చిత్రం ఓటిటిలో రిలీజ్ అవ్వడంతో.. నాని పై డిస్ట్రిబ్యూటర్లు మండిపడ్డారు.
అదే క్రమంలో కొందరు రాజకీయ నాయకులు కూడా నానిని విమర్శిస్తూ కామెంట్లు చేశారు.ఇలాంటి సంఘటనలతో మళ్ళీ ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోకూడదని నాని భావించాడు. అయితే ఈరోజు ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్స్ లో పాల్గొన్న నానికి మళ్ళీ టికెట్ రేట్ల ఇష్యు గురించి ప్రశ్న ఎదురైంది. ‘అయ్య బాబోయ్ రేపు సినిమా రిలీజ్ ఉంది..ఈ ప్రశ్న ఎదురవ్వకూడదు అనుకున్నాను ఎదురయ్యింది.ఇప్పుడు ఎలాంటి థంబ్ నెయిల్స్ పెడతారో’ అంటూ కంగారు పడుతూనే ఈ విషయం పై నాని స్పందించాడు.
నాని మాట్లాడుతూ…”రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే.. టికెట్ రేట్లు తగ్గించడం అనేది ప్రేక్షకుల్ని అవమానించడం వంటిది. రూ.10, రూ.20 వంటి రేట్లతో థియేటర్ల కలెక్షన్లు.. వాటి పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ల కంటే తక్కువగా ఉంటున్నాయి. టికెట్ ధరలతో సంబంధం లేకుండా సినిమాల్ని చూడడానికి జనాలు రెడీగా ఉన్నారు” అంటూ నాని చెప్పుకొచ్చాడు.
నాని కామెంట్లని వ్యతిరేకిస్తూ మంత్రి బొత్సా వంటి వారు ‘టికెట్ రేట్లు తగ్గిస్తే అవమానించడం ఎలా అవుతుంది’ అంటూ ప్రశ్నించారు. ఈ విషయం పై ఇంకా ఎంత పెద్ద వైరల్ అవుతుందో చూడాలి..!