పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పవన్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుని రీఎంట్రీలో కూడా తనకు పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని పవన్ ప్రూవ్ చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో సైతం ఈ మూవీ థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
ప్రస్తుతం సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్ నటిస్తుండగా ఈ సినిమాతో పాటు పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది. అయితే పవన్ మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై తాజాగా పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ప్రస్తుతం ఆయనతో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం.
పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో అనుకున్న సమయానికి పవన్ సినిమాలను పూర్తి చేయగలరా..? అనే ప్రశ్నలు సైతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ పాలిటిక్స్ తో బిజీ అయితే మాత్రం ఈ సినిమాల రిలీజ్ డేట్స్ మారే అవకాశం అయితే ఉంటుంది. పవన్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల గతంలో అజ్ఞాతవాసి షూటింగ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే.