పవన్ కల్యాణ్ కెరీర్‌ను తొలి రోజుల నుండి గమనించినవాళ్లకు ఓ విషయం కచ్చితంగా తెలుస్తుంది. అదే ఓ సినిమా విడుదలయ్యాక ఇంకో సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటాడు. అయితే ‘వకీల్‌సాబ్’ చిత్రీకరణ జరుగుతున్నప్పుడే వరుస సినమా ప్రకటించేశాడు. సినిమా పూర్తయి, విడుదల చేసే గ్యాప్‌లో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టేశాడు. అయితే ‘వకీల్‌సాబ్’విడుదల తర్వాత గ్యాప్ వచ్చింది. ఇది ఆయన తీసుకున్నది కాకపోయినా.. వచ్చేసింది. ఇప్పుడు ఇదే టాపిక్.
పవన్ ఎప్పుడూ తీసుకునే గ్యాప్ ఈ సారి కరోనా కారణంగా వచ్చింది. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్‌కు కరోనా సోకడంతో గత నెల రోజుల నుండి పవన్ షూట్‌లో పాల్గొనడం లేదు. ఇప్పుడు కరోనా తగ్గినా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల కారణంగా షూట్ జరిగే పరిస్థితి లేదు. అయితే ఒకవేళ పూర్తిస్థాయి షూటింగ్స్‌కు ప్రభుత్వాలు సమ్మతించినా పవన్ అప్పుడే షూటింగ్స్‌కి వచ్చే పరిస్థితి లేదట. కరోనా తర్వాతి ఆరోగ్య పరిస్థితుల కారణంగా పవన్ ఇప్పుడే షూటింగ్ చేయరట. కాబట్టి ఈసారి కూడా లాంగ్ గ్యాప్ పెద్దగానే ఉంటుందట.
పవన్ చేతిలో ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇది కాకుండా హరీశ్ శంకర్ – మైత్రీ మూవీ మేకర్స్, సురేందర్ రెడ్డి – రామ్ తాళ్లూరి సినిమాలు వస్తాయి. వీటితోపాటు భగవాన్ -పుల్లారావు నిర్మాతలుగా ఓ సినిమా ఉంటుంది. దీంతోపాటు దిల్ రాజు నిర్మాణంలో కూడా ఓ సినిమా ఉండబోతోంది. అయితే పవన్ ఇప్పుడు గ్యాప్ తీసుకుంటే… ఈ సినిమాల షెడ్యల్స్ అన్నీ మారిపోతాయి.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!