అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’.మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది వకీల్ సాబ్, అఖండ తర్వాత రాబోతున్న పెద్ద చిత్రమిది. కాబట్టి ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘పుష్ప’ తెలుగులో మాత్రమే కాదు తమిళ,హిందీ,మలయాళంలో కూడా విడుదలవుతుంది. ‘బాహుబలి’ లానే రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఫస్ట్ పార్ట్ అయిన ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న 5 భాషల్లో విడుదల కాబోతుంది. ‘అల.. వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ, ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రం కావడంతో ‘పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధించడం తధ్యమని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బన్నీకి నార్త్ ఆడియెన్స్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ ఉంది. అతని సినిమాలని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే
వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదవుతున్నాయి. ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాటల వలన బన్నీ మార్కెట్ బాలీవుడ్లో కూడా భారీగా పెరిగింది.ఈ నేపథ్యంలో ‘పుష్ప’ హిందీ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది.హిందీ లో ఈ చిత్రానికి 10 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ‘బాహుబలి1’ కి మించిన క్రేజ్ ను ‘పుష్ప’ సొంతం చేసుకుంది. అయితే బుక్కింగ్స్ మాత్రం అంత ఆశాజనకంగా లేవు.
చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు సుమిత్ కడేల్ తెలియజేసారు.’ ‘పుష్ప’ హిందీ ఓపెనింగ్స్ రూ.50 లక్షల నుండి రూ.1.50 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.’పుష్ప’ కి ముందు రోజు ‘స్పైడర్ మ్యాన్’ విడుదల కాబోతుండడంతో ‘పుష్ప’ ఓపెనింగ్స్ బాగా డల్ గా ఉన్నాయని.. ఆ సినిమా ప్రభావం ‘పుష్ప’ పై పడినట్టు’ ఆయన తెలిపాడు.
Most Recommended Video
మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్ టాలీవుడ్ హీరోలకు కలిసొచ్చిందా!