Ram Charan: చరణ్‌ కోసం శంకర్‌ హీరోయిన్‌ ఫైనల్‌ చేశారా

టాలీవుడ్‌లో ఒకసారి జోడీ కుదిరి… అది వెండితెర మీద హిట్‌ అయ్యింది అంటే… ఆ జోడీని రిపీట్‌ చేయడానికి మన దర్శకనిర్మాతలు ఆసక్తిచూపిస్తుంటారు. హీరోలు కూడా అంతే. అలా ఇప్పుడు ఓ జోడీ రిపీట్‌ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఆ జోడీ నటించిన తొలి సినిమా ఇంకా విడుదల కాకపోవడం గమనార్హం. ఎవరా జోడీ అనుకుంటున్నారా? ఇంకెవరు రామ్‌చరణ్‌, ఆలియా భట్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తొలిసారి నటిస్తున్న ఈ జోడీని శంకర్ సినిమాలో చూడొచ్చనేది కొత్త వార్త.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రషెష్‌ చూసినవాళ్లు రామ్‌చరణ్, ఆలియా జోడీ అదిరిపోయిందని ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తున్నాడట. ఇదే మాట దిల్‌ రాజు, శంకర్‌ చెవిన కూడా పడినట్లుంది. అందుకే వీరి కాంబినేషన్‌లో రాబోతున్న చరణ్‌ సినిమాకు ఆలియా అయితే బాగుంటుందేమో అని అనుకుంటున్నారట. అయితే మరి ఆలియా డేట్స్‌ ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి లాంటివి చూడాలి. ఎందుకంటే శంకర్‌ సినిమా ఏ హీరోయిన్ అయినా ఠక్కున ఓకే చేసేస్తుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

ఇప్పటివరకు చరణ్‌ హీరోయిన్‌ను రిపీట్ చేసిన సందర్భాలు తక్కువ. అందులో వరుస సినిమాల్లో అంటే ఇంకా తక్కువ. ఒక్క కాజల్‌ విషయంలోనే గతంలో ఇలా జరిగింది. ఇప్పుడు ఆలియా విషయంలో ఇలా జరుగుతుందని అంటున్నారు. అయితే శంకర్‌ సినిమా విషయంలో హీరోయిన్‌ ఎంపిక ఇంకా ఫైనల్ అవ్వలేదని టాక్‌. త్వరలో దీనిపై అఫీషియల్‌ కన్ఫర్మేషన్‌ వస్తుందంటున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus