Bigg Boss: మరోసారి బిగ్ బాస్ స్టేజ్ పై శివగామి!

తమిళ బిగ్ బాస్ షోను కమల్ హాసన్ హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోని హోస్ట్ చేయలేని పరిస్థితి. దీంతో నిర్వాహకులు టెంపరరీగా ఓ హోస్ట్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో శృతిహాసన్ పేరు జోరుగా వినిపించింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. తమిళ బిగ్ బాస్ ను హోస్ట్ చేయడానికి సీనియర్ నటిని రంగంలోకి దింపుతున్నారు.

ఆమె మరెవరో కాదు.. రమ్యకృష్ణ. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఈ క్రమంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ సినిమాలో శివగామి క్యారెక్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు కోలీవుడ్ లో కొన్ని టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇప్పుడు తమిళ బిగ్ బాస్ లో ఆమె హోస్ట్ గా కనిపించబోతుంది.

గతంలో తెలుగులో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కారణంగా.. ఒక వారం బిగ్ బాస్ షోని హోస్ట్ చేయలేకపోయారు. ఆ సమయంలో రమ్యకృష్ణను తీసుకొచ్చారు. తెలుగు బిగ్ బాస్ షోలో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన హోస్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మరోసారి బిగ్ బాస్ షోలో సందడి చేయడానికి రెడీ అవుతోంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus