Rana: ఇండస్ట్రీ షేకింగ్ కాంబో రెడీ .. హీరో ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగా లీడర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా కూడా ఆకట్టుకున్నాడు. బాహుబలి సినిమాలో రానా పోషించిన భల్లాల దేవ్ పాత్ర మరి ఏ హీరో చేసిన సినిమా అంత హిట్ అయి ఉండేది కాదేమో అని చెప్పడంలో సందేహం లేదు .

ఆ తర్వాత భీంలా నాయక్ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ కంటే రానా అనే సంగతి అందరికీ తెలిసిందే. కాగా మరోసారి రానా దగ్గుబాటి విలన్ గా నటించడానికి ఫిక్సయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నిఖిల్ నెక్స్ట్ చేస్తున్న మూవీ “స్పై”. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్లకు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది . తాజాగా ఈ చిత్రం అఫీషియల్ గా రిలీజ్ అనౌన్స్మెంట్ డేట్ కూడా ఇచ్చేసింది .

జూన్ 29న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాలో రానా దగ్గుబాటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది. రానా ఓ పెద్ద ఎపిసోడ్లో కనిపించబోతున్నట్లు వినికిడి. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కనిపించి కనిపించినట్లు తన ఫ్యాన్స్ కి కిక్కిస్తాడంటున్నారు ఫ్రెండ్స్ . అయితే రానా పాత్ర సినిమాని మలుపు తిప్పబోతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతుంది .

జూన్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమాలో స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన రహస్యాన్ని చూపించబోతున్నట్లు స్పష్టం చేశారు మేకర్స్. దీంతో రానా ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేయబోతున్నాడా..? అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus