మరోసారి యంగ్‌ డైరక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చిన శౌర్య.. ఈసారి ఎలాంటి..

కొన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం అందుకోకపోయినా.. హీరో ఇమేజ్‌ను మార్చేస్తుంటాయి. అయితే ఫలితం తేడా కొట్టింది కాబట్టి ఆ సినమాకు ఆశిచినంత గుర్తింపు రాదు. అయితే ఆ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తోంది అంటే మాత్రం ఆసక్తి రేగుతుంటుంది. అలాంటి కాంబినేషన్లలో నాగశౌర్య (Naga Shaurya) – పవన్‌ బాసంశెట్టి (Pawan Basamsetti) ఒకటి. ఇద్దరూ కలసి గతంలో ‘రంగబలి’ (Rangabali) అనే సినిమా చేశారు. సినిమాకు బాక్సాఫీసు దగ్గర ఆశించిన స్పందన రాలేదు.

అయితే, సినిమాలోని ఫన్.. హీరో నాగశౌర్య – కమెడియన్‌ సత్య (Satya) మధ్య కామెడీ ట్రాక్‌ భలేగా పేలాయి. అయితే మొత్తం సినిమాను ఒక బంచ్‌గా అందించే క్రమంలో ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు మరోసారి ఈ కాంబో సెట్‌ అవుతోందట. నాగశౌర్య ఇమేజ్‌కి చక్కగా సూట్‌ అయ్యేలా ఓ కథను పవన్ బాసంశెట్టి సిద్ధం చేశారట. ‘రంగబలి’ సినిమా నిర్మించిన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.

మరి ‘రంగబలి’ సినిమాకు మించిన కథ రాస్తారా? లేక అలాంటి నవ్వుల కథే రాసి పోయిన చోటే సంపాదించుకుంటారా అనేది చూడాలి. ఏమాటకామాట ఆ సినిమాలో కామెడీ అయితే అదిరిపోతుంది. దర్శకుడు పవన్‌ బాసంశెట్టి పెన్నులో వినోదం గట్టిగానే ఉంది అని అర్థమవుతోంది. ఇక ‘రంగబలి’ తర్వాత శౌర్య చిన్న పాజ్‌ తీసుకొని వరుస సినిమాలు ఓకే చేసేశాడు. ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ‘పోలీసు వారి హెచ్చరిక’ పూర్తయిపోయింది.

ఇది కాకుండా ఎస్‌ ఎస్‌ అరుణాచలం దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఎప్పటిదో పాత సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ అలానే ఉంది. మరి ఈ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు అనేది చూడాలి. సరైన విజయం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న నాగశౌర్యకు ఈ సినిమా కీలకంగా మారుతుందాఇ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం మరి ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు అనౌన్స్‌ అవుతుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus