Rashmika: టాలీవుడ్ లో టాప్ లేపుతున్న రష్మిక!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో రష్మీక ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్న ఈమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. తెలుగు తమిళ భాష చిత్రాలు మాత్రమే కాకుండా హిందీ భాష చిత్రాలలో కూడా అవకాశాలు అందుకున్నటువంటి ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత,పూజా హెగ్డే, రకుల్ వంటి వారందరూ కూడా 3 కోట్ల రూపాయల వరకు ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు కానీ రష్మిక మాత్రం ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక త్వరలోనే గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఈమె నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది. యానిమల్ సినిమా కంటే ముందుగా కమిట్ అయిన సినిమాలకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలన్నింటికీ కూడా నాలుగో కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట

ఈ సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అయితే మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఈమె (Rashmika) టాప్ లో ఉన్నారని చెప్పాలి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus