Rashmika: అప్పుడు మిస్ అయ్యింది.. ఈసారి వర్కౌట్ అవుతుందా?

‘ఛలో’ ‘గీత గోవిందం’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్.. బ్లాక్ బస్టర్లు అందుకుని అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. ఇక మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈమె స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ఆ వెంటనే ‘భీష్మ’ తో మరో హిట్టు అందుకుని.. ఏకంగా అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతి పాత్రలో కనిపించబోతుంది.

కచ్చితంగా ఈ చిత్రం ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో పాటు శర్వానంద్ తో ఓ సినిమా అలాగే బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ అనే మరో క్రేజీ మూవీలో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా రష్మిక మరో క్రేజీ ఆఫర్ ను కూడా పెట్టేసిందట. వివరాల్లోకి వెళితే.. నాని హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చిందట. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్.. నానితో ఓ సినిమా చెయ్యబోతున్నట్టు టాక్ నడుస్తుంది.

ఈ ప్రాజెక్టులో రష్మిక ను హీరోయిన్ గా అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. గతంలో నానితో రష్మిక ‘దేవదాస్’ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ సో సో అన్నట్టే ఆడింది. ఇక వేణు శ్రీరామ్ తో నాని కూడా గతంలో ‘ఎం.సి.ఎ’ చిత్రం చేసాడు. ఇది కూడా మంచి సక్సెస్ సాధించింది. మరి ఈ చిత్రం కూడా ఆ స్థాయిలో విజయం సాధిస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus