Ravi Teja: అన్ని ప్లాపులు పడినా రవితేజ తగ్గడం లేదుగా..!

  • January 18, 2024 / 04:25 PM IST

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ ‘కిక్’ వంటి సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి ఘన విజయాలు సాధించాయి. రవితేజ సినిమాలను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే వాటికి కూడా మంచి వ్యూయర్ షిప్ వస్తుంది. అక్కడి లోకల్ ఛానల్స్ లో ఆ సినిమాలను టెలికాస్ట్ చేసినా మంచి టి.ఆర్.పి రేటింగులు నమోదవుతున్నాయి. దీంతో రవితేజ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కోట్లల్లో అమ్ముడుపోతున్నాయి.

అందుకే రవితేజ తన సినిమాలను తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేసి మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నాడు. కానీ అది మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు. ఆల్రెడీ రవితేజ నటించిన ‘ఖిలాడి’ ‘ధమాకా’ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కచ్చితంగా హిందీలో తనకు మంచి మార్కెట్ తెచ్చిపెడుతుంది అని రవితేజ బలంగా నమ్మాడు.

తెలుగులో ఏనాడూ చేయని ప్రమోషన్ అంతా ముంబై వెళ్లి చేశాడు. తిరిగి హైదరాబాద్ వచ్చాక కూడా బాలీవుడ్ మీడియాని తెగ పొగిడేశాడు. అయినా రవితేజ అనుకున్నది జరగలేదు.పైగా తెలుగు మీడియాకి కూడా నెగిటివ్ అయిపోయాడు. ఇంత జరిగినా రవితేజకి హిందీ మార్కెట్ పై మోజు తగ్గలేదు.

అతని లేటెస్ట్ మూవీ ‘ఈగల్’ ని కూడా హిందీలో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. సంక్రాంతికి రావాల్సిన ‘ఈగల్’ మూవీ ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ అయ్యింది. అదే డేట్ కి ‘సహదేవ్’ పేరుతో హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం రవితేజ (Ravi Teja) కూడా రెడీ అవుతున్నాడు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus