వాలంటీర్ల వ్యవస్థని వ్యతిరేకిస్తూ ‘జనసేన’ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘వాలంటీర్ ఉద్యోగం పేరుతో వారి జీవితాలను రూ.5వేలకే అంకితం చేసారని, సామాన్యుల జీవితాల్లోకి వారు తొంగి చూసే అలవాటు నేర్పారని, ఎవరింట్లో ఎంత మంది ఉన్నారు..? వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి? వాళ్ళ ఆదాయం ఎంత? ఆ ఇళ్లల్లో అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు?.. ఇలాంటి డేటాని నువ్వు సేకరించి ఏం చేయాలనుకుంటున్నావ్.
విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువైందని ఢిల్లీ నుండి సమాచారం అందింది’ అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పవన్ చేసిన కామెంట్లపై వైసీపీ మంత్రుల్లో ఒకరైన ఆర్కే రోజా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ చేసిన వ్యాఖ్యల్లో విమెన్ ట్రాఫికింగ్ అనే ఆరోపణ నాకు నచ్చలేదు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్లపై అలాంటి వ్యాఖ్యలు సరికాదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. సీఎం జగన్‌ను కూడా చులకన చేసి మాట్లాడుతున్నారు. చివరికి వాలంటీర్లను చూసి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి వణుకు పుడుతుంది. అందుకే వాళ్ళ పై విషం చిమ్ముతున్నారు. విమెన్ ట్రాఫికింగ్ కోసం వాలంటీర్లు పని చేస్తున్నారా? వుమెన్ ట్రాఫికింగ్‌లో ఏపీ టాప్ 10లో ఉందని అంటున్నావ్..
తెలంగాణ ఏ స్థానంలో ఉందో తెలుసా? ఆరో స్థానంలో ఉంది. చంద్రబాబు హయాంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ వెలుగు చూసినప్పుడు నేను పోరాటం చేశాను. అప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు. నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా’ అంటూ ఘోరమైన కామెంట్లు చేసింది రోజా.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!